హామిల్టన్ ట్వంటీ20 సిరీస్ : సూపర్ ఓవర్ సాగిందిలా...

గురువారం, 30 జనవరి 2020 (10:36 IST)
న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు ఓ చిరస్మరణీయమైన విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. బుధవారం హామిల్టన్ వేదికగా జరిగిన మూడో ట్వంటీ20 మ్యాచ్‌లో టీమిండియా కుర్రోళ్లు అద్భుత ప్రదర్శన పుణ్యమాని ఈ విజయంసాధ్యమైంది. ముఖ్యంగా, ఈ మ్యాచ్ నరాలు తెగే ఉత్కంఠత మధ్య ముగిసింది. 
 
తొలి రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సిరీ్‌సను నిర్ణయించే కీలక పోరులో విశ్వరూపం ప్రదర్శించాడు. మొదట వాయువేగంతో హాఫ్‌ సెంచరీ చేసిన హిట్‌మ్యాన్‌ సూపర్‌ ఓవర్‌ చివరి రెండు బంతుల్ని సిక్సర్లుగా మలిచి మ్యాచ్‌కు తనదైన ఫినిషింగ్‌ టచ్‌ ఇచ్చాడు. 
 
అంతకుముందు కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ ఫోర్లు, సిక్సర్లతో తుఫాన్‌ ఇన్నింగ్స్‌ ఆడి న్యూజిలాండ్‌ను విజయం అంచుల దాకా నడిపించినా, షమి మ్యాజిక్‌కు వెనుదిరగడం ఆ జట్టును దెబ్బ తీసింది. దాంతో టై అయిన మ్యాచ్‌ సూపర్‌ ఓవర్‌కు దారితీయగా అంతిమంగా భారత్‌ విజేతగా నిలిచింది. అయితే, ఇరు జట్ల మధ్య జరిగిన సూపర్ ఓవర్ ఇలా సాగింది.
 
సూపర్‌ ఓవర్లో తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ జట్టులో కేన్‌ విలియమ్సన్‌ - గప్తిల్ జోడి బ్యాటింగ్‌కు దిగింది. తొలుత బుమ్రా బౌలింగ్‌ చేశాడు. ఇక భారత్‌ తరపున రోహిత్ ‌- కేఎల్ రాహుల్‌ రాగా, సౌథి బౌలింగ్‌కు దిగాడు.
 
న్యూజిలాండ్ బ్యాటింగ్ (బౌలర్‌: బుమ్రా)
తొలి బంతి : విలియమ్సన్‌ - 1 రన్‌
రెండో బంతి: గప్తిల్‌ - 1 రన్‌
మూడో బంతి: విలియమ్సన్‌ -సిక్స్‌
నాలుగో బంతి : విలియమ్సన్‌ - ఫోర్‌
ఐదో బంతి : విలియమ్సన్‌ - 1 బై
ఆరో బంతి : గప్తిల్‌ - ఫోర్‌
మొత్తం ఆరు బంతుల్లో వికెట్ నష్టపోకుండా 17 రన్స్ చేసింది. 
 
భారత్ బ్యాటింగ్ (బౌలర్‌: సౌథి)
తొలి బంతి : రోహిత్‌ -2 రన్స్‌
రెండో బంతి: రోహిత్‌ - 1 రన్‌
మూడో బంతి: రాహుల్‌ - ఫోర్‌
నాలుగో బంతి: రాహుల్‌ - 1 రన్‌
ఐదో బంతి : రోహిత్‌ - సిక్స్‌
ఆరో బంతి : రోహిత్‌ - సిక్స్‌
మొత్తం ఆరు బంతుల్లో వికెట్ నష్టపోకుండా 20 రన్స్. 
 
ఫలితం.. : భారత్ చిరస్మరణీయమైన విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు