అహ్మదాబాద్ వేదికగా ద్వైపాక్షిక చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఉభయ దేశాల మధ్య పలు వాణిజ్య ఒప్పందాలతో పాటు ఇండో ఫసిఫిక్, ఆప్ఘనిస్తాన్, ఇరాన్ ప్రాంతాలలో పెట్రేగిపోతున్న ఉగ్రవాదం అంశాలు చర్చకు రానున్నాయి.
ట్రంప్ పర్యటన సందర్భంగా కొత్త సైనిక హార్డ్వేర్ ఒప్పందం జరిగే అవకాశం లేకపోయినప్పటికీ, భారతదేశం అపాచీ అటాక్ హెలికాప్టర్లు, భారత నావికాదళానికి బహుళ ప్రయోజన హెలికాప్టర్లు, అమెరికన్ డిఫెన్స్ కాంట్రాక్టర్ల నుండి పి 8 ఐ మల్టీ మిషన్ విమానాలను కొనుగోలు చేయాలని భావిస్తోంది.