ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ నెల్లూరు జిల్లాకు రానున్నారు. దత్తత తీసుకున్న గూడురు మండలంలోని పుట్టంరాజువారికండ్రిగలో పర్యటించనున్నారు. అనంతరం ఈ ఊరు బాగోగులపై అక్కడి ప్రజలతో చర్చించనున్నారు. మరికొన్ని విషయలపై కూడా ఆయన ఆరా తీయనున్నారు. సమాచారం తెలుసుకున్న ఆ గ్రామవాసులు ఇప్పటినుంచే ఏర్పాట్లు చేసే పనిలో పడ్డారు. తమ ఊరి పరిస్థితిని సచిన్ చక్కబెట్టి ఊరు అభివృద్ధికి కృషి చేస్తారని ఆ గ్రామస్తులు ఎదురుచూస్తున్నారు.
కాగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్... అభిమానులు క్రికెట్ దేవుడు అని ముద్దుగా పిలుచుకుంటారు. అయితే ఆ గ్రామ ప్రజలకు నిజంగానే దేవుడిలానే కనిపించాడు. పుట్టంరాజువారి కండ్రిక... నెల్లూరు జిల్లాలోని ఈ గ్రామాన్ని సచిన్ దత్తత తీసుకున్న సంగతి గుర్తుండే ఉంటుంది. తమ గ్రామాన్ని సచిన్ దత్తత తీసుకున్నాడు అని తెలియగానే అక్కడి ప్రజలు పండుగ చేసుకున్నారు.
సచిన్ తమ గ్రామానికి వస్తున్నాడని తెలిసి - కొత్త బట్టలు కొనుక్కుని మరీ సంబరాలు చేసుకున్నారు. సచిన్ టెండూల్కర్ సూపర్ స్టార్ అంటూ పాటలు పాడుకున్నారు. సచిన్ అడుగుపెట్టిన తమ నేల బంగారం అయిపోతుందనుకున్నారు. గ్రామాన్ని దత్తత తీసుకున్న తర్వాత కన్నెత్తి కూడా చూడలేదని విమర్శలు వచ్చాయి. తాజాగా సచిన్ నెల్లూరుకు వస్తున్నారని తెలుసుకున్న పుట్టంరాజువారికండ్రిగ గ్రామస్తులు పండగ చేసుకుంటున్నారు.