కానీ కోహ్లీ ఓ బంతిని సిక్సర్‌గా మలిచి ఒత్తిడిని తగ్గించాడు. ఆ బంతి నోబాల్ కావడంతో ఫ్రీహిట్ లభించగా, కోహ్లీ బౌల్డ్ అయ్యాడు. కానీ బంతి ఫీల్డర్ల నుంచి దూరంగా వెళ్లడంతో కోహ్లీ, కార్తీక్ మూడు పరుగులు తీయడంతో చివర్లో రెండు బంతుల్లో రెండు పరుగులు అవసరం అయ్యాయి.
ఈ దశలో కార్తీక్ అవుట్ కావడంతో క్రీజులోకి అశ్విన్ వచ్చాడు. నవాజ్ ఓ వైడ్ విసరడంతో స్కోర్లు సమం అయ్యాయి. చివరి బంతికి ఒక పరుగు కావాల్సి ఉండగా, అశ్విన్ ఓ లాఫ్టెడ్ డ్రైవ్‌తో విన్నింగ్ షాట్ కొట్టాడు. సీన్ కట్ చేస్తే.... భారత్ గెలిచింది, పాక్ ఓడింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 159 పరుగులు చేసింది. ఏదేమైనా కోహ్లీ వీరోచిత ఇన్నింగ్స్ ఈ మ్యాచ్‌లో హైలైట్‌గా నిలిచింది. పాక్ బౌలర్లలో హరీస్ రవూఫ్ 2, మహ్మద్ నవాజ్ 2 వికెట్లు తీశారు.