రాహుల్ ద్రావిడ్‌కు కరోనా పాజిటివ్... జట్టులో కలకలం

మంగళవారం, 23 ఆగస్టు 2022 (11:47 IST)
భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్‌కు కరోనా వైరస్ పాజిటివ్ సోకింది. దీంతో జట్టులో కలకలం చెలరేగింది. ప్రస్తుతం టీమిండియా జింబాబ్వే పర్యటనలో ఉంది. ఈ పర్యటనలో భాగంగా, మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌ను రోహిత్ సేన క్లీన్ స్వీప్ చేసింది. 
 
ఈ నేపథ్యంలో శనివారం నుంచి ఆసియా కప్ 2022 కౌంట్‌డౌన్ ప్రారంభంకానుంది. శనివారం నుంచి ఈ మెగా టోర్నీ మొదలుకానుంది. ఇందుకోసం యూఏఈకి వెళ్లేందుకు సిద్ధమవుతోంది. అయితే, జట్టుతో కలిసి రాహుల్ ద్రావిడ్ యూఏఈకి వెళ్లడం లేదు. దీనికి కారణం ఆయనకు కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలింది. 
 
దీంతో ద్రావిడ్ ఆసియా కప్‌లో కూడా పాల్గొనడం సందేహంగా మారింది. యూఏఈకి బయలుదేరే ముందు భారత జట్టు సభ్యులకు కోవిడ్ పరీక్షలు చేయగా, అందులో రాహుల్ ద్రావిడ్‌కు పాజిటివ్‌గా తేలినట్టు సమాచారం. అయితే, ద్రావిడ్ ఆరోగ్యంపై బీసీసీఐ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు