పాకిస్థాన్ మాజీ క్రికెటర్ అర్షద్ ఖాన్ ఆర్థిక ఇబ్బందులతో ట్యాక్సీ డ్రైవర్‌గా మారాడు. పాకిస్థాన్ తరఫున 1997-98లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన ఆ ఆఫ్ స్పిన్నర్.. 2006 వరకు 9 టెస్ట్‌లు, 85 వన్డేలు ఆడాడు. ఆఫ్ స్పిన్నర్‌గా ఓ వెలుగు వెలిగిన అర్షద్ ఖాన్.. రిటైర్‌మెంట్ అనంతరం దయనీయ పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. కుటుంబాన్ని పోషించేందుకు ఆస్ట్రేలియా, సిడ్నీలో ట్యాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.