సచిన్‌ను తొలిసారి ఇంటర్వ్యూ చేసిన స్పోర్ట్స్ జర్నలిస్టు ఇకలేరు..

శనివారం, 30 సెప్టెంబరు 2017 (09:05 IST)
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ను తొలిసారి ఇంటర్వ్యూ చేసిన స్పోర్ట్స్ జర్నలిస్టు టామ్ అల్టెర్ ఇకలేరు. ఆయన వయసు 67 యేళ్లు. సినిమా, టెలివిజన్, థియేటర్ సీనియర్ నటుడిగా రాణించి, పద్మశ్రీ అవార్డు అందుకున్న టామ్ అల్టెర్ స్టేట్ - ఫోర్ చర్మ కేన్సర్‌తో  బాధపడుతూ, శుక్రవారం రాత్రి ఆయన నివాసంలోనే కన్నుమూశారు. ఈయనకు భార్య కరోల్, కుమారుడు జామీ, కుమార్తె అఫ్షాన్ ఉన్నారు. 
 
1980లలో స్పోర్ట్స్ జర్నలిస్టుగానూ పనిచేసిన మూడు పుస్తకాలు కూడా రాశారు. 300కుపైగా సినిమాల్లో నటించారు. పలు టీవీ షోలలోనూ నటించిన ఆయన దర్శకత్వంలోనూ ప్రతిభ చాటారు. టీవీ కోసం సచిన్ టెండూల్కర్‌ను తొలిసారి ఇంటర్వ్యూ చేసింది టామ్‌నే. 2008లో ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ పౌర పురస్కారంతో గౌరవించింది.
 
బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు పొందిన టామ్ మరణంతో తమ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయిందని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. భారత్‌లో మూడోతరం అమెరికన్ అయిన టామ్ 1950లో హిల్‌స్టేషన్‌ అయిన ముస్సోరీలో జన్మించారు. పుణెలోని ప్రఖ్యాత ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్‌లో చేరి గోల్డ్ మెడల్ సంపాదించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు