ఇక.. సాకర్ స్టార్లు క్రిస్టియానో రొనాల్డో (266 మిలియన్), లియోనెల్ మెస్సీ (184 మిలియన్), నేమార్ (147 మిలియన్) తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్న క్రీడా సెలెబ్రిటీ విరాట్ కోహ్లీనే కావడం విశేషం.
అంతేకాదు.. ఇంతమంది ఫాలోవర్లు ఉన్న తొలి క్రికెటర్ కోహ్లీనే. విరాట్‌కు ఇప్పటికే ఫేస్బుక్లో 36 మిలియన్లు, ట్విటర్లో 40.8 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. కాగా.. విరాట్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్క స్పాన్సర్డ్ పోస్ట్‌కు రూ.1.29 కోట్లు తీసుకుంటాడని సమాచారం.