బంగ్లాదేశ్‌ను తేలిగ్గా తీసుకోం... కరణ్ నాయర్ ఔట్ : విరాట్ కోహ్లీ

బుధవారం, 8 ఫిబ్రవరి 2017 (13:11 IST)
బంగ్లాదేశ్‌ను అంత తేలిగ్గా తీసుకోబోమని భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నారు. హైదరాబాద్‌ వేదికగా భారత్‌-బంగ్లాదేశ్‌ మధ్య రేపటి నుంచి ఏకైక టెస్ట్‌మ్యాచ్‌ జరగనుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కోహ్లి మాట్లాడాడు. ప్రతి అంతర్జాతీయ మ్యాచ్‌ తమకు కీలకమేనని.. బంగ్లాదేశ్‌ను తేలికగా తీసుకోవడం లేదన్నారు. 
 
బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో టీమిండియా పటిష్టంగా ఉందన్నాడు. ఈ మ్యాచ్‌లో కరుణ్‌ నాయర్‌ స్థానంలో రహానేను తీసుకోనున్నట్లు చెప్పాడు. రంజీల్లో మంచి ప్రదర్శన చేసిన కుల్దీప్‌ యాదవ్‌ ఈ మ్యాచ్‌లో రాణిస్తాడని ఆశిస్తున్నట్లు పేర్కొన్నాడు. చైనామన్‌ బౌలింగ్‌ యాక్షన్‌ అతడికి అదనపు బలమన్నాడు.
 
అలాగే, ఈ ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో కరుణ్ నాయర్ స్థానంలో అజింక్య రహానేను తీసుకుంటున్నట్లు కోహ్లీ తెలిపారు. రహానే అద్భుతంగా రాణిస్తున్నాడని, బ్యాటింగ్‌ స్థిరత్వం, ఫీల్డింగ్‌లో అసమాన ప్రతిభ కలిగిన గొప్ప క్రికెటర్ అని కొనియాడారు. ఒక్క గేమ్‌తో గత రెండు సంవత్సరాల కృషిని అంచనా వేయలేమని, టీంలో అత్యంత స్థిరత్వం ఉన్న క్రికెటర్ అని రహానేపై ప్రశంసలు కురిపించారు.

వెబ్దునియా పై చదవండి