జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం: పవన్ కల్యాణ్ చెప్పిందే మాట.. పిఠాపురమే వేదిక (video)

సెల్వి

సోమవారం, 17 ఫిబ్రవరి 2025 (22:39 IST)
Pawan kalyan
జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సంబంధించి ఆ పార్టీ కీలక ప్రకటన చేసింది. మార్చి 14న జరగనున్న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నియోజకవర్గం పిఠాపురంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది.
 
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జనసేన 100శాతం స్ట్రైక్ రేట్ సాధించి అద్భుతమైన విజయాన్ని సాధించింది. కూటమి ప్రభుత్వ ఏర్పాటులో ఆ పార్టీ కీలక పాత్ర పోషించింది. చారిత్రాత్మక ఎన్నికల విజయం తర్వాత జరుగుతున్న మొదటి ఆవిర్భావ దినోత్సవ వేడుక ఇది కాబట్టి, ఈ కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు చేయడానికి ప్రణాళికలు వేస్తున్నారు.
 
ఇందులో భాగంగా జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రతిపాదన మేరకు పిఠాపురంలో వేడుకలు నిర్వహించాలనే నిర్ణయం తీసుకున్నారు. 3 రోజులపాటు ఈ వేడుకలు నిర్వహించబోతున్నారని తెలుస్తోంది. మార్చి 12, 13, 14 తేదీల్లో పిఠాపురంలో ప్లీనరీ నిర్వహించాలని తీర్మానించారు.

జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో జనసేన సిద్ధాంతాలు, పవన్‌ కల్యాణ్‌ ఆశయాలు, ప్రజలకు జనసేన చేస్తున్న సేవ గురించి వివరించనున్నారు. దాంతోపాటు, భవిష్యత్తులో జనసేనను ఏ విధంగా బలోపేతం చేయాలి అనే విషయాలపై కూడా చర్చించనున్నారు.

పిఠాపురంలో మార్చ్ 14న భారీ బహిరంగ సభ ????✊
గత సార్వత్రిక ఎన్నికల్లో 100 శాతం స్ట్రయిక్ రేట్ తో జనసేన విజయ బావుట!!
ఎన్నికల అనంతరం నిర్వహిస్తున్న ఆవిర్భావ సభ ఇది ????????.@PawanKalyan @JanaSenaParty pic.twitter.com/0ExleWcjkI

— Team PoliticalSena (@Teampolsena) February 17, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు