నిజానికి ఈ అత్యాచార కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు శుక్రవారం తుది తీర్పును వెలువరించనుంది. దీంతో పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో హైటెన్షన్ నెలకొనివుంది. ఫలితంగా ఇరు రాష్ట్రాల్లో పారామిలిటరీ బలగాలను మొహరించారు. పైగా, ఈ అంశం ఇపుడు దేశ వ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది.
ఈ నేపథ్యంలో... గుర్మీత్ సింగ్‌కు సంబంధించిన అన్ని అంశాలపై నెటిజన్లు అనేక ఆసక్తికర పోస్టులు చేస్తున్నారు. ముఖ్యంగా 2016లో టీమిండియా ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, ఆశిష్ నెహ్రూ, విజయ్ దహియా ఆయన వద్దకు వెళ్లగా తీసిన వీడియోలు, ఫొటోలు ఇప్పుడు హల్‌చల్ చేస్తున్నాయి.
అందులో వారంతా సదరు వివాదాస్పద బాబా ఆశీస్సులు తీసుకుంటున్నారు. టీమిండియా కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ సాధించిన విజయాల వెనుక తన పాత్ర ఉందని పలుసార్లు చెప్పుకున్నారు. తాను ఇచ్చిన సలహాలతోనే కోహ్లీ రాణిస్తున్నాడని అన్నారు. అంతేకాదు. బాక్సర్ విజయేందర్ సింగ్ కూడా తన శిష్యుడేనని, తన అశీస్సులు తీసుకున్న తర్వాతే రాణించాడని ఆ బాబా వ్యాఖ్యలు చేసేవారు.