ఐపీఎల్ 6: కోల్ కతాలో ప్రారంభోత్సవం అదుర్స్‌కు అంతా సిద్ధం!

FILE
కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆరో సీజన్ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఈ కార్యక్రమం మంగళవారం సాయంత్రం అంగరంగ వైభవంగా కోల్ కతాలోని సాల్ట్ లేక్ స్టేడియం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. బాలీవుడ్ బాద్షా, కోల్ కతా నైట్ రైడర్స్ సహ యజమాని షారూక్ ఖాన్, అందాల తార కత్రీనా కైఫ్ ఈ భారీ ఈవెంట్ ఓపెనింగ్‌లో తమ ప్రదర్శనలతో ఆకట్టుకోనున్నారు.

ఇక వీరికి తోడు ఇంటర్నేషనల్ ర్యాప్ స్టార్ పిట్ బుల్ తన గాన మాధుర్యంతో భారతీయులను సమ్మోహితుల్ని చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ కార్యక్రమానికి తొలుత పాప్ క్వీన్ జెన్నిఫర్ లోపెజ్‌ను ఆహ్వానించాలని భావించినా, ఆమె కోర్కెల జాబితా విని ఐపీఎల్ నిర్వాహకులు కంగుతిన్నారు. లోపెజ్‌తో కాదనుకుని చివరకు పిట్ బుల్ వైపు మొగ్గారు.

ఇంకా ఐపీఎల్ ప్రారంభోత్సవంలో చైనీస్ కళాకారుల బృందం ఫ్లయింగ్ డ్రమ్స్ విన్యాసాలు ప్రదర్శించనుంది. మరుసటి రోజు ఐపీఎల్ మ్యాచ్‌లు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ఆరో సీజన్ ఐపీఎల్ క్రికెట్ జట్లు ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నాయి.

వెబ్దునియా పై చదవండి