కన్నడ నటి సంజనతో విరాట్ కోహ్లీ లవ్ అఫైర్!

FILE
ప్రభాస్ హీరోగా నటించిన "బుజ్జిగాడు"లో సెకండ్ హీరోయిన్ రోల్ ప్లే చేసిన కన్నడ భామ సంజన.. ప్రస్తుతం టీమ్ ఇండియా యువ క్రికెటర్ విరాట్ కోహ్లీతో ప్రేమాయణం కొనసాగిస్తున్నట్లు వార్తలు షికార్లు చేస్తున్నాయి.

విశాఖపట్నంలో బుధవారం ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో అరుదైన ఫీట్‌ను సాధించిన విరాట్ కోహ్లీ.. టాలీవుడ్‌లో కాకపోయినా కన్నడంలో మంచి డిమాండ్ ఉన్న గ్లామర్ గర్ల్ సంజనతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నట్లు సమాచారం.

అలాగే ఆసీస్‌తో జరిగిన రెండో వన్డేలో 118 పరుగులు సాధించి, తన అంతర్జాతీయ వన్డే క్రికెట్ కెరీర్‌లో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్న కోహ్లీ.. సంజన అంటే పడి చస్తున్నాడట. కానీ ఢిల్లీకి చెందిన ఈ యంగ్ బ్యాట్స్‌మెన్ కెరీర్ అద్భుతంగా కొనసాగుతుండగా, ప్రేమదోమ అంటూ సంజన వెంట పడటం మంచిది కాదని కోహ్లీ కుటుంబసభ్యులు భావిస్తున్నారు.

అంతేకాదు.. సంజనతో ఇప్పుడు లవ్వొద్దు బాబూ.. అంటూ బుజ్జిగించినా కోహ్లీ వినిపించకోకపోవడంతో.. సంజనతో తిరగడం ఆపి.. కెరీర్‌పై దృష్టి పెట్టమని కోహ్లీపై ఒత్తిడి తెస్తున్నారట..!. అయితే టీమ్ ఇండియా కొత్త లవర్ బాయ్ కోహ్లీ మాత్రం సంజనా..! అంటూ ఆమె వెంటే తిరుగుతున్నాడట..!.

వెబ్దునియా పై చదవండి