దీపికాతో స్టేడియంలోనే లిప్‌లాక్ చేసిన సిద్ధార్థ్ మాల్యా!
శనివారం, 23 ఏప్రియల్ 2011 (19:32 IST)
FILE
బాలీవుడ్ పొడవు కాళ్ల సుందరి దీపికా పదుకునే సిద్ధార్థ్ మాల్యాతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నట్లు వార్తలొస్తున్న సంగతి తెలిసింది. ప్రముఖ పారిశ్రామిక వేత్త విజయ్ మాల్యా తనయుడైన సిద్ధార్థ్ మాల్యాతో దీపికా పదుకునే డేటింగ్ చేస్తుందని సినీ వర్గాల్లో టాక్. దీన్ని రుజువు చేసేలా ఈ జంట ఇండియన్ ప్రీమియర్ లీగ్ నాలుగో సీజన్‌లోనూ కనువిందు చేసింది.
విజయ్ మాల్యా జట్టైన బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్.. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను మట్టికరిపించిన సందర్భంగా దీపికా పదుకునే-సిద్ధార్థ్ మాల్యా జంట సంతోషానికి ఎల్లలు లేకుండా పోయింది. స్టేడియంలో మ్యాచ్‌ను తిలకించిన ఈ జంట బెంగళూరు గెలవగా ఒకరికొరు కౌగలించుకుని ముద్దు పెట్టుకుని లక్షలాది మంది క్రికెట్ అభిమానులను సంతోషపెట్టారు.
అంతేకాదు సిద్ధార్థ్ మాల్యా ఏకంగా ఆమెను హగ్ చేసుకుని తన జట్టు విజయానికి గెంతులేశాడు. వీరిద్దరి రొమాన్స్ చూస్తూ అక్కడనున్న అభిమానులంతా చూడచక్కని జంట అని మాట్లాడుకున్నారట. మరి కొందరైతే వీరిద్దరి రొమాన్స్ చూడలేక వామ్మో అనుకున్నారట. మరి దీపికా-సిద్ధార్థ్ మాల్యాలు మాత్రం ఎవరినీ లెక్కచేయకుండా తమ పనేదో తాము చూసుకుంటూ ఉండిపోయారట.
కాగా, ఇండియన్ ప్రీమియర్ నాలుగో సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో వెస్టిండీస్ బోర్డుతో ఘర్షణ చెంది మరీ ఐపీఎల్‌కు వచ్చిన క్రిస్ గేల్ సుడిగాలి శతకం సాధించటంతో బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ కోల్‌కతాపై తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. వరుస ఓటములతో సతమవుతున్న బెంగళూర్ జట్టుకు ఈ విజయంతో ఉపశమనం లభించింది.