తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ జిల్లాకు చెందిన బిట్టు కుమార్ అనే వ్యక్తి ఈ నెల 16వ తేదీ నుంచి కనిపించకుండా పోయాడు. కుటుంబ సభ్యులు ఎంతగా గాలించినా ఆచూకీ కనిపెట్టలేకపోయారు. దీంతో వారు 18వ తేదీన స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ చేపట్టారు. ఈ క్రమంలో బిట్టు ఓ యువతితో ప్రేమలో ఉన్నట్టు తెలుసుకున్నారు. దీంతో ఆ యువతి సోదరుడు రాహుల్‌ను అనుమానించి అదుపులోకి తీసుకుని విచారించగా, అసలు విషయాన్ని బట్టబయలు చేశాడు.
తన సోదరిని ప్రేమిస్తూ, ఆమెతో సన్నిహితంగా ఉండటాన్ని జీర్ణించుకోలేక చంపేసినట్టు అంగీకరించాడు. ఇందులోభాగంగా, ఈ నెల 16వ తేదీన మద్యం సేవిద్దామని నమ్మించి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి హత్య చేశానని, శరీరాన్ని ముక్కలు చేసి కుక్కలకు ఆహారంగా వేసినట్టు చెప్పాడు. మిగిలిన భాగాలను నదిలో పడేసినట్టు వాంగ్మూలం ఇచ్చాడు. దీంతో రాహుల్‌ను అరెస్టు చేశారు. నదిలో పడేసిన శరీర భాగాల కోసం గాలిస్తున్నారు.