ఫిల్మ్ నగర్‌లో అనుమానాస్పద కార్మికుడు మృతి!

ఠాగూర్

గురువారం, 27 ఫిబ్రవరి 2025 (10:33 IST)
హైదరాబాద్ ఫిల్మ్ నగర్ పరిధిలో ఒక సినీ కార్మికుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. నాగర్ కర్నూల్ జిల్లా పనివెల గ్రామానికి చెందిన హుస్సేన్ (55), ఇందిరమ్మ దంపతులు కుమార్తెతో కలిసి ఫిల్మ్ నగర్‌లోని మాగంటి కాలనీ నివాసం ఉంటున్నారు. 
 
హుస్సేన్ ఇంటికి వెళుతూ సమీపంలో నిర్మాణంలో ఉన్న భవనంలోకి వెళ్లి కుప్పకూలి మృతి చెందాడు. అక్కడ పనిచేస్తున్న భవన నిర్మాణ కార్మికులు ఈ విషయాన్ని భవన యజమానికి తెలియజేశారు. దీంతో ఆయన వెంటనే అక్కడికి చేరుకుని ప్రహరీ లోపల ఉన్న మృతదేహాన్ని హుస్సేన్ ఇంటికి తరలించాడు. 
 
మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హుస్సేన్‌కు తల వెనుక మూడు గాయాలు, మోకాలికి, ఎడమ కంటికి గాయాలు అయినట్లు గుర్తించారు. అక్కడి కూలీలు మాత్రం హుస్సేన్ తలకు భవనం లోపల సజ్జ తగిలింది. చెబుతున్నారు. అయితే, ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా? లేక ఎవరైనా అక్కడికి పిలిచి పథకం ప్రకారం హత్య చేశారా? అనే కోణంలో ఫిల్మ్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు