తెలుగురాని అమ్మాయిలను బాగా ప్రేమిస్తాం... ఎంకరేజే చేస్తాం : నిర్మాత ఎస్‌కేఎన్ (Video)

ఠాగూర్

సోమవారం, 17 ఫిబ్రవరి 2025 (10:48 IST)
ఇకపై తన చిత్రాల్లో తెలుగు రాని అమ్మాయిలను హీరోయిన్లుగా ఎంపిక చేసి వారిని ఎంకరేజే చేయడంతో పాటు ప్రేమిస్తామని నిర్మాత ఎస్‌కేఎన్ అంటున్నారు. తెలుగు వచ్చిన అమ్మాయిలకు హీరోయిన్ ఛాన్స్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తే ఏమవుతుందో తమకు బోధపడిందని అందువల్ల ఇకపై తెలుగు రాని అమ్మాయిలను మాత్రమే ఎంకరేజ్ చేస్తామని ఆయన చెప్పారు. 
 
తాజాగా హైదరాబాద్ నగరంలో జరిగిన ఓ ఈవెంట్‌లో ఆయన పాల్గొని మాట్లాడుతూ, తెలుగు వచ్చిన అమ్మాయిల కంటే తెలుగు రాని అమ్మాయిలనే మేం ఎక్కువగా లవ్ చేస్తామన్నారు. ఎందుకంటే తెలుగు వచ్చిన అమ్మాయిలను ఎంకరేజ్ చేస్తే ఏం అవుతుందో తర్వాత నాకు తెలిసిందన్నారు. అందుకని ఇకపై తెలుగు రాని అమ్మాయిలను ఎంకరేజ్ చేయాలని తాను, దర్శకుడు సాయిరాజేశ్ అనుకుంటున్నట్టు చెప్పారు. 
 
ఎస్కేఎన్ ఈ తరహా కామెంట్స్ చేయడానికి కారణం లేకపోలేదు. ఆయన గతంలో "బేబీ" అనే చిత్రాన్ని నిర్మించారు. ఇందలో వైష్ణవి చైతన్యకు హీరోయిన్‌గా అవకాశం కల్పించారు. ఈ ఘన విజయం సాధించింది. పైగా, హీరోయిన్‌కు మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత ఆమెకు అనేక ఆఫర్లు వచ్చాయి. ప్రస్తుతం సిద్ధు జొన్నలగడ్డ, ఆనంద్ దేవరకొండ వంటి  హీరోలతో నటిస్తున్నారు. కానీ, ఎస్‌కేఎన్ బ్యానరులో చేయడానికి ఆమె మరోమారు అంగీకరించలేదు. అందుకే వైష్ణవి చైతన్యను టార్గెట్ చేస్తూ నిర్మాత ఎస్.కె.ఎన్ కామెంట్స్ చేశారనే చర్చ ఫిల్మ్ నగర్‌లో జరుగుతోంది. 


 

Producer SKN's shocking comment on Telugu heroines... pic.twitter.com/AMyNiAJTgQ

— Webdunia Telugu (@WebduniaTelugu) February 17, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు