తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ కథనం వివరాలను పరిశీలిస్తే, ఈ జంటకు యేడాది క్రితమే వివాహమైంది. అయితే, ఆ తర్వాత కొంతకాలం నుంచే వీరి మధ్య విభేదాలు పొడసూపడంతో వేర్వేరుగా ఉంటున్నారు. ఆమె తిరిగి తన పుట్టింటికి వెళ్లిపోయింది.
ఇక కలిసి ఉండటం సాధ్యం కాదని భావించిన ఆమె (21) విడాకులు తీసుకుందామని ప్రతిపాదించింది. ఇది భర్తకు ఆగ్రహం తెప్పించింది. ఆమెపై కక్ష తీర్చుకోవాలని భావించి ఆమె ప్రైవేటు ఫొటోలు, వీడియోలను అసభ్య కామెంట్లతో ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు.