మహిళపై అఘాయిత్యం చేయబోయిన యువకుడు.. కేకలు వేయడంతో పరుగో పరుగు (Video)

వరుణ్

శుక్రవారం, 26 జులై 2024 (11:48 IST)
నేటి సమాజంలో మహిళల మాన ప్రాణాలకు ఏమాత్రం రక్షణ లేకుండా పోయింది. పట్టపగలే మహిళలపై దాడులు, అఘాయిత్యాలకు తెగబడుతున్నారు. తాజాగా హైదరాబాద్‌ నగరంలో ఓ మహిళపై కామాంధుడు ఒకడు ఘాయిత్యం చేయబోయాడు. అయితే, ఆ మహిళ అప్రమత్తమై బిగ్గరగా కేకలు వేయడంతో ఆ యువకుడు పారిపోయాడు. 
 
మొగల్‌పూరలోని సుల్తాన్ షాహీ ప్రాంతంలో గురువారం ఒక మహిళ ఇంటి బయట బట్టలు ఆరబెడుతుండగా, గుర్తు తెలియని యువకుడు బైక్‌పై వచ్చి వెనుక నుండి ఆమె నోరు మూసి హత్తుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో అప్రమత్తమైన మహిళ వెంటనే కేకలు వేయడంతో యువకుడు పారిపోయాడు.. ఇలా తెలియని వ్యక్తులు మా ప్రాంతంలోకి వచ్చి మహిళలను టార్గెట్ చేస్తున్నారని స్థానికులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ద్వారా విచారణ జరిపి యువకుడి ఆచూకీ కోసం వెతుకుతున్నారు.


 

హైదరాబాద్‌లో మహిళపై అఘాయిత్యం చేయబోయిన యువకుడు.. మహిళ అప్రమత్తతతో పారిపోయిన యువకుడు

మొగల్‌పూరలోని సుల్తాన్ షాహీ ప్రాంతంలో నిన్న ఒక మహిళ ఇంటి బయట బట్టలు ఆరబెడుతుండగా, గుర్తు తెలియని యువకుడు బైక్‌పై వచ్చి వెనుక నుండి ఆమె నోరు మూయడానికి ప్రయత్నించాడు.

అప్రమత్తమైన మహిళ వెంటనే… pic.twitter.com/uJURSyXw1j

— Telugu Scribe (@TeluguScribe) July 26, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు