హైదరాబాద్ ప్రాంతీయ రింగ్ రోడ్డు.. రూ.1,525 కోట్లు కేటాయింపు

సెల్వి

శుక్రవారం, 26 జులై 2024 (10:51 IST)
రాష్ట్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌లో ప్రాంతీయ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) కోసం రూ.1,525 కోట్లు ప్రతిపాదించింది. ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్), ఆర్ఆర్ఆర్ మధ్య ప్రాంతాన్ని పరిశ్రమలు, సేవలు రవాణా పార్కులను ఆకర్షించడానికి అభివృద్ధి చేస్తారు. 
 
ఆర్ఆర్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించబడుతుంది. భూసేకరణ పురోగతిలో ఉంది. దీన్ని తొలుత నాలుగు లైన్ల హైవేగా నిర్మిస్తారు. 
 
ప్రాథమిక అంచనాల ప్రకారం, ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం రూ.13,522 కోట్లు, దక్షిణ భాగం రూ.12,980 కోట్లు. పనులు నత్తనడకన సాగడంతో దశలవారీగా నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు