స్నేహితుడని ఇంటికి పిలిస్తే భార్యను లోబరుచుకున్నాడు.. చివరకు భర్త చేతిలో...

ఠాగూర్

గురువారం, 6 ఫిబ్రవరి 2025 (13:05 IST)
స్నేహితుడని ఇంటికి పిలిచిన వ్యక్తి ఇపుడు నేరస్థుడుగా నిలబడ్డాడు. తన భార్యను స్నేహితుడు లోబరుచుకున్నాడు. ఈ విషయం తెలుసున్న భర్త.. భార్యతో పాటు స్నేహితుడుని కూడా పలుమార్లు హెచ్చరించాడు. కానీ, వారిద్దరి ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. దీంతో కట్టుకున్న భార్యను లేకుండా చేయాలని ప్లాన్ వేశాడు. తన పథకంలో భాగంగానే, తమ బిడ్డను స్కూల్‌లో వదిలిపెట్టి వస్తున్న భార్యను కత్తితో విచక్షణారహితంగా పొడిచి చంపేశాడు. ఈ దారుణం బెంగుళూరు నగరంలోని హెబ్బగోడి సమీపంలో ఉన్న వినాయనగర్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
వినాయక నగర్‌కు చెందిన మోహన్ రాజు (32), శ్రీరంగ (29) అనే దంపతులు ఉన్నారు. వీరికి ఆరేళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే, మోహన్ రాజుకు తనతో పాటు ఫ్యాక్టరీలో పని చేసే ఓ స్నేహితుడు ఉన్నాడు. ఇతన్నీ తరచూ తన ఇంటికి తీసుకెళ్లేవాడు. ఈ క్రమంలోనే శ్రీరంగను మోహన్ రాజు స్నేహితుడు లోబరుచుకున్నాడు. ఈ విషయం మోహన్ రాజుకు తెలియడంతో ఇద్దరినీ అతను మందలించాడు. అయినప్పటికీ వారిలో ఎలాంటి మార్పు రాలేదు. దీంతో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తడంతో గత కొన్ని రోజులుగా మోహన్ రాజు, శ్రీరంగలు వేర్వేరుగా ఉంటున్నారు. 
 
ఈ నేపథ్యంలో తాజాగా తన కుమారుడుని చూసేందుకు భార్య ఇంటికి మోహన్ రాజు వెళ్లగా, ఆ సమయంలో వారిద్దరి మధ్య మళ్లీ వాగ్వాదం జరిగింది. దీంతో శ్రీరంగను అంతం చేయాలని మోహన్ రాజ్ నిర్ణయించికున్నాడు. ఈ క్రమంలో బుధవారం తన కుమారుడుని స్కూల్‌లో వదిలిపెట్టి తిరిగి వస్తున్న భార్య శ్రీరంగపై భర్త మోహన్ రాజు కత్తితో అనేకసార్లు పొడిచాడు. దీంతో ఆమె అక్కడే ప్రాణాలు కోల్పోయింది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. నిందితుడు మోహన్ రాజును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు