ప్రియుడిపై దాడి.. బాలిక కిడ్నాప్.. అత్యాచారం... ఎక్కడ?

శుక్రవారం, 11 ఆగస్టు 2023 (09:10 IST)
తన ప్రియుడితో మాట్లాడుతున్న ఓ బాలికను కొందరు కామాంధులు కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రియుడిపై దాడి చేసిమరీ ఈ దారుణానికి పాల్పడ్డారు. తమిళనాడు రాష్ట్రంలోని తిరుపూరు జిల్లాలో వెలుగు చూసింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
తిరుపూరు జిల్లా పల్లడం ప్రాంతానికి చెందిన 17 యేళ్ల బాలిక కేశవంపాళెయం రోడ్డులో తన ప్రియుడితో కలిసి మాట్లాడుతుండగా అటుగా వచ్చిన పల్లడం అన్నానగర్‌కు చెందిన రమేష్ కుమార్ (31), జాన్సన్ (26), పార్తీపన్ (25)లు యువకుడిపై దాడి చేసి ఆ బాలికను అపహరించి ఓ నిర్మానుష్య అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డారు. 
 
ఈ ఘటన అంతా వీడియోలు, ఫోటోలు తీసి, ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ బెదిరించి అక్కడ నుంచి పారిపోయారు. బాధితురాలిని పల్లడం - కోవై రోడ్డులో వదిలిపెట్టారు. అక్కడ నుంచి ఇంటికి వెళ్లిన బాలిక జరిగిన ఘోరాన్ని తల్లికి చెప్పి, పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు