భారత్ చేసిన సర్జికల్ ఎటాక్‌తో పాకిస్థాన్ గూబ గుయ్ మంది... కానీ, దానిని బయటపడనీయకుండా ఆ దేశం బీరాలు పలుకుతోంది. అసలు మా దేశంపై భారత్ దాడులు జరగలేదంటూనే, మరోపక్క ఈ దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటిస్తోంది. ఈ నేపథ్యంలో అసలు భారత్, పాక్‌ల సైనిక పటిమ ఎంత... ప్రపంచ దేశాల సైనిక శక్తిలో భారత్, పాక్‌ల స్థానం ఎంతో చూడండి.
ప్రపంచ దేశాల్లో సైనిక శక్తిలో భారత్ - 4వ స్థానం. పాక్ - 13వ స్థానం
- సాయుధ బలగాలు అన్నీకలిపి భారత్ - 48 లక్షలు, పాక్ - 14 లక్షలు
- యుద్ధ విమానాలు - భారత్ - 1015. పాక్ - 490
- ఎయిర్ క్రాఫ్ట్‌లు - భారత్ - 2,086. పాక్ - 923.
- యుద్ధ ట్యాంకులు - భారత్ - 6,000. పాక్ - 4,000
- జలాంతర్గాములు భారత్- 13. పాక్ - 8.
- అణు జలాంతర్గామలు భారత్- 2. పాక్ -0
- డిస్ట్రాయిర్స్ - భారత్ - 9. పాక్ - 6