దక్షిణాది మైఖేల్ జాక్సన్‌గా పేరుగాంచిన ప్రభుదేవా తన ప్రియురాలు నయనతారకోసం ఎట్టకేలకు మొదటి భార్యను విడాకులకు ఒప్పించగలిగాడు. శనివారం భార్య రమాలత్, ప్రభుదేవా చెన్నైలోని ఫ్యామిలీ కోర్టు ముందుకు వచ్చారు. విచారణ చేసిన కోర్టు వారి విడాకులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈ కేసుపై ఈనెల 7వ తేదీన విచారణ జరుగనుంది.
ఇదిలావుండగా తన మొదటి భార్యాపిల్లల పేరన బ్యాంకులో 10 లక్షల రూపాయల ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశాడు ప్రభుదేవా. అదేవిధంగా చెన్నై, హైదరాబాదులలో సుమారు 3 కోట్ల రూపాయలు విలువ చేసే భవనాలను వారికి రాసి ఇచ్చాడు.
ఎంతకీ భర్త తన దారికి రాకపోవడంతో రమాలత్ విడాకులు తీసుకునేందుకు అంగీకరించింది. ఇక నయనతార తన పంతాన్ని నెగ్గించుకుని ప్రియుడు ప్రభుదేవాను మొగుడ్ని చేసుకోబోతోంది.