ఇంట్లో, ఆఫీసులో తాబేలు ఉంచండి.. తాబేలును ఆఫీసు లోపల, ఇంట్లో ఉంచడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. విష్ణువు కూర్మ రూపంలో అవతరించాడు. దీనిని కూర్మావతారం అని కూడా అంటారు. ఇంట్లో లేదా కార్యాలయంలో తాబేలును ఉంచడం ద్వారా, నిలిచిపోయిన పని పూర్తవుతుందని.. వ్యక్తి ప్రతి దిశలో విజయాన్ని పొందుతారని చెబుతారు. నీటిలో పెట్టండి.. ఎక్కువ కాలం జీవించే ఏకైక జంతువు తాబేలు.
ఇంట్లో పూజా స్థలంలో లోహంతో చేసిన తాబేలును ఉంచవచ్చు. ఉత్తర దిశలో.. తాబేలును ఉత్తరాన ఉంచడం శుభప్రదం. ఎందుకంటే ఉత్తర దిశను లక్ష్మీదేవి స్థానంగా భావిస్తారు. తాబేలును ఈ దిశలో ఉంచడం వల్ల వ్యాపారంలో విజయం, డబ్బు వస్తుంది అలాగే శత్రువులను నాశనం చేస్తుంది.
తాబేలును నీరు లేకుండా ఉంచవద్దు. నీటిలో ఉంచడం శుభప్రదం. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లయితే, క్రిస్టల్ తాబేలును తీసుకురావాలి. తాబేలు ముఖాన్ని ఎల్లప్పుడూ ఇంటి లోపలి వైపు ఉంచడం ప్రయోజనకరం. పడకగదిలో పెట్టవద్దు.. తాబేలును డ్రాయింగ్ రూమ్‌లో ఉంచాలని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి.