అంతర్జాతీయ బాలల ప్రసార దినోత్సవం!

శనివారం, 19 జులై 2008 (15:31 IST)
FileFILE
అంతర్జాతీయ బాలల ప్రసార దినోత్సవం... అసలు ఇలాంటి పండుగ ఒకటి ఉందనే సంగతి మనదేశంలో చాలా మందికి తెలియదు. కానీ, ప్రపంచ దేశాలలో ప్రతి సంవత్సరం డిసెంబరు నెల రెండో ఆదివారం నాడు ఈ దినాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

ఐక్యరాజ్యసమితి సాంస్కృతిక విద్యామండలి (యునిసెఫ్), అంతర్జాతీయ టెలివిజన్ కళా, వైజ్ఞానిక అకాడమీలు సంయుక్తంగా ఈ బాలల ప్రసార దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాయి.
మార్చేద్దాం..!
  అనేక వందల దేశాలలో ఈ బాలల ప్రసార దినం క్రమక్రమంగా ప్రాచుర్యం పొందుతున్నప్పటికీ మనదేశంలో మాత్రం అంతంతమాత్రంగానే ఉంది. కాబట్టి... నేటి ప్రభుత్వం, దేశ పౌరులుగా మనందరం ఈ పరిస్థితిని మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది.      


ఈ బాలల దినోత్సవం నాడు ప్రపంచంలోని సుప్రసిద్ధ ప్రసార కేంద్రాలన్నీ చిన్నారి బాలల కోసం ప్రత్యేక కార్యక్రమాలను ప్రసారం చేస్తాయి. ఎక్కువగా బాలలే స్వయంగా రూపొందించిన కార్యక్రమాలే ఈ ప్రసారాల్లో ఉండటం గమనించదగ్గ విషయం. వీటికితోడు పిల్లలకు అవసరమైన సమాచారాన్ని అందించే కార్యక్రమాలు కూడా ప్రసారం అవుతాయి.

బాలల ప్రసార పండుగ రోజున ప్రతి సంవత్సరం వేలాదిమంది బాల ప్రసార కళాకారులు సదవకాశాన్ని వినియోగించుకుని తమ ప్రతిభను వెలుగులోకి తెస్తున్నారు. అనేక వందల దేశాలలో ఈ బాలల ప్రసార దినం క్రమక్రమంగా ప్రాచుర్యం పొందుతున్నప్పటికీ మనదేశంలో మాత్రం అంతంతమాత్రంగానే ఉంది. కాబట్టి... నేటి ప్రభుత్వం, దేశ పౌరులుగా మనందరం ఈ పరిస్థితిని మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

వెబ్దునియా పై చదవండి