సాధారణంగా చిన్న పిల్లల మూత్రంలో రక్తం పడుతుంటుంది. ఇది అనేక మంది పిల్లల్లో కనిపించి సమస్యే అయినప్పటికీ.. రెండు నుంచి ఐదు శాతం పిల్లల్లో కనిపిస్తుంది. దీనివల్ల పెద్ద ప్రమాదమేమీ లేకపోయినప్పటికీ మూత్ర విసర్జన చేసే సమయంలో పొత్తి కడుపు నొప్పి ఉంటే మాత్రం వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది.
సాధారణంగా పిల్లలు పుట్టుక సమయంలోనే మూత్రనాళంలో రాళ్లు, రక్తానికి సంబంధించిన సికిల్ సెల్ డిసీజ్, కోయాగ్యులోపతి వంటి హెమటలాజికల్ సమస్యలు ఉంటాయి. ముఖ్యంగా, వైరల్/బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, మూత్రనాళంలో అడ్డంకులు, కొల్లాజెన్ వాస్క్యులార్ డిసీజ్, ఐజీఏ నెఫ్రోపతి వంటి ఇమ్యునలాజికల్ సమస్యలు, పుట్టుకతో మూత్రపిండాల లోపాలు ఉండటం వల్ల పిల్లల మూత్రవిసర్జన చేసే సమయంలో రక్తం పడుతుంది.
అయితే, ఈ రక్తం అన్నిసార్లూ కంటికి కనపడేంత రక్తం రాకపోవచ్చని వైద్యులు ఉంటున్నారు. దీన్ని తెలుసుకోవాలంటే మైక్రోస్కోపిక్ లేదా కెమికల్ పరీక్షలు చేయాల్సి ఉంటుందని వైద్యులు చెపుతున్నారు. అయితే, ఈ సమస్య వల్ల భయపడాల్సిన అవసరం లేదని వైద్యులు అంటున్నారు.