ఇందుకోసం కొన్ని సూచనలు పాటిస్తే చాలు. మీరు ప్రతి రోజూ ఏదో ఒక పండును తింటున్నారా. అల్పాహారాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటున్నారా లేదా చెక్ చేసుకోవాలి. అలాగే, పని ఒత్తిడిని తట్టుకునేందుకు కాస్త రిలీఫ్ అయ్యేందుకు ఇష్టానుసారంగా కాఫీ టీలను తీసుకోరాదు. వేళాపాలా లేకుండా చిరుతిండ్లు తినకూడదు. వీటి వల్ల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది.
వారంలో ఒకటి రెండు సార్లు మాత్రమే మాంసాహారాన్ని తినాలి. మీరు ప్రతి రోజూ తీసుకునే భోజనంలో ఖచ్చితంగా కూరగాయలు, ఆకుకూరలు ఉండేలా చూసుకోవాలి. ఉప్పు, కారం, నూనె వంటివి మీకు సరిపడా అంటే తక్కువ మోతాదులోనే తీసుకుంటున్నారా లేదా అన్నది తెలుసుకోవాలి. నీరసం, అజీర్తి, రక్తహీనత వంటి సమస్యలను ఎపుడూ ఎదుర్కొంటున్నట్టు గ్రహించారా.