ఎనర్జి డ్రింక్సుతో ఆల్కహాల్‌ను కలిపి తాగొచ్చా? ఫాస్ట్ ఫుడ్స్ తినేటప్పుడు..?!

సోమవారం, 8 ఆగస్టు 2016 (12:31 IST)
ఫాస్ట్‌ఫుడ్స్‌ తినాలనే కోరిక పుట్టిందా.. అయితే ఇంట్లోనే ట్రై చేయండి. సాధారణంగా బర్గర్స్‌ లోపల ఉండే టిక్కాలో నూనె ఎక్కువగా ఉంటుంది. పోషకాలు తక్కువగా ఉంటాయి. అందుకని ఆ టిక్కా స్థానంలో బేక్‌ చేసిన ఆకు కూరలు లేదా పెసలు, కందులు వంటి గింజలతో చేసిన పదార్థాన్ని పెట్టి తింటే బర్గర్‌ ఎంతో రుచికరంగా ఉంటుంది. అందులో పోషకపదార్థాలు కూడా పుష్కలంగా ఉంటాయి.
 
సాఫ్ట్‌ డ్రింక్స్‌‌లో ఎలాంటి పోషకపదార్థాలుండవు. పైగా ఇవి శరీరంలో ఉన్న కాల్షియంను పీల్చేస్తాయి. అందుకే సాఫ్ట్‌ డ్రింక్స్‌ను ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది. సాఫ్ట్‌ డ్రింక్స్‌కు బదులు పళ్ల రసాలు శరీరానికి మంచిది. అలాగే రోజూ పాలు తప్పనిసరిగా తాగాలి.
 
పిజ్జాలు కూరగాయలు, తక్కువ ఫ్యాట్‌ ఉన్న వెన్న, ఆకుకూరలు టాపింగ్స్‌గా పెట్టి తింటే రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికీ మంచిది. ఇక ఎనర్జీ డ్రింక్స్‌ తాగితే వెంటనే ఎనర్జీ వచ్చినట్టు అనిపిస్తుంది. వీటిల్లో బి విటమిన్స్‌ బాగా ఉంటాయి. రోజుకు ఒక ఎనర్జీ డ్రింకు మించి తాగకూడదు. కెఫెన్‌ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. కెఫెన్‌ ఉన్న వాటిని ఎక్కువ పర్యాయాలు తీసుకోవడం వల్ల నిద్రలేమి సమస్య తలెత్తుతుంది. ఎనర్జీ డ్రింక్సులో కూడా కెఫెన్‌ ఉంటుంది. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆల్కహాల్‌ను ఎనర్జీ డ్రింకుతో కలిపి తాగకూడదు.

వెబ్దునియా పై చదవండి