క్యాలీఫ్లవర్ శరీరానికి చలువ చేస్తుంది. శరీరంలో ఉష్ణాన్ని తగ్గించి వేడి చేయకుండా చూస్తుంది. గోబిపువ్వును తినడం వల్ల జీర్ణశక్తి వృద్ధి చెందుతుంది. తిన్న ఆహారం త్వరగా అరుగుతుంది. దీని ఆకులను సలాడ్‌ల రూపంలో తీసుకోవచ్చు. దీనిని తింటే రోగ నిరోధక వ్యవస్థ మెరుగుపడి వ్యాధులు త్వరగా నయం అవుతాయి. ప్రతి రోజూ 50 గ్రాముల క్యాలీఫ్లవర్ ఆకులు తింటే దంత సమస్యలు రాకుండా ఉంటాయి.
చిగుళ్లు, దంతాలు పటిష్టంగా మారతాయి. కేశాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. జుట్టు రాలడం తగ్గుతుంది. ఒత్తుగా పెరుగుతుంది. క్యాన్సర్‌తో బాధపడేవారు ప్రతిరోజూ ఉదయాన్నే పరగడుపున క్యాలీఫ్లవర్ జ్యూస్ తాగితే తప్పకుండా ఉపశమనం పొందవచ్చు. మలినాలను బయటకు నెట్టి జీర్ణాశయాన్ని, పేగులను శుభ్రం చేస్తుంది. శరీరానికి గాయం తగిలితే క్యాలీఫ్లవర్ ఆకుల రసం రాస్తే త్వరగా మానిపోతుంది. పుండ్లు కూడా మాయమవుతాయి.