కోడిమాంసం వర్సెస్ కోడిగుడ్డు, ఏది తింటే మంచిది?

సిహెచ్

శనివారం, 17 ఫిబ్రవరి 2024 (22:29 IST)
కోడి మాంసం లేదా కోడి గుడ్లు ఏవి బెస్ట్ అనే సందేహం చాలామందికి. కానీ ప్రోటీన్ కావాలనుకునేవారికి చికెన్ బెటర్ ఛాయిస్. ఐతే కోడిగుడ్డులో క్యాల్షియం తదితర పోషకాలుంటాయి. కనుక వేటికవే ప్రత్యేకం. మన శరీరాన్ననుసరించి ఎంపిక చేసుకోవాలి. చికెన్-ఎగ్ పోషకాలు ఎలా వుంటాయో తెలుసుకుందాము.
 
కోడి మాంసంలో ఒక్కో భాగంలో ఒక్కో విధమైన పోషకాహారం వుంటుంది.
కండరాలను పెంచుకుని, బరువు తగ్గాలని అనుకునేవారు చికెన్ బ్రెస్ట్ తినాలి.
బరువు పెరగాలని కోరుకునేవారు చికెన్ తొడలు తింటే ఫలితం వుంటుంది.
100 గ్రాముల చికెన్‌లో 143 కేలరీల శక్తి లభిస్తే, కోడిగుడ్డులో అయితే 155 కేలరీల శక్తి వుంటుంది.
కోడిగుడ్డులోని ఆహార కొలెస్ట్రాల్ రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచే అవకాశం లేదంటున్నారు నిపుణులు.
కోడిగుడ్డులో క్యాల్షియం మొదలు పలు విటమిన్లు వున్నాయి.
కోడిగుడ్డు తింటుంటే శరీరానికి పుష్కలంగా పోషకాలు అందుతాయి.
రోగనిరోధక శక్తిని పెంచడంలో కోడిగుడ్డు సాయపడుతుంది, బరువు తగ్గించడంలోనూ దోహదపడుతుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు