ఇపుడు ప్రతి ఒక్కరూ జుట్టు సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ విషయంలో ఆడా, మగా అనే తేడా లేదు. దీనికి కారణం మారుతున్న జీవనశైలితో పాటు.. ఆహారపు అలవాట్లే. గతంలో కంటే ఇపుడు ప్రతి యువతీ యువకుడు ఆధునిక జీవనశైలిలో జీవించేందుకు అలవాటుపడుతున్నారు. ఫలితంగా అనేక అనారోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటున్నారు. ఇలాంటి వాటిలో ఒకటి జుట్టు సమస్య.
దీనికితోడు.. జుట్టు ఊడిపోవడానికి అనేక సమస్యలు లేకపోలేదు. వాతావరణ కాలుష్య సమస్యతో పాటు.. మార్కెట్లోకి వచ్చే కొత్తకొత్త షాంపులు వాడటం వల్ల, చుండ్రు సమస్య వల్ల, నీరు వల్లగానీ ఉడిపోతుంది. అయితే మనం స్నానం చేసే నీటిలో ఉప్పు శాతం అధికంగా ఉంటే జుట్టు చిట్లి వెంట్రుకాలు పొడిబారి ఉడిపోతాయి.