వ్యాయామం చేసేందుకు టైమ్ లేదంటే.. మెట్లెక్కి దిగండి. కుర్చున్న చోట కాళ్లు, చేతులు సాగదీయండి, గుంజిళ్లు తీయండి. లేకుంటే చేతుల్ని గుండ్రంగా తిప్పడం వంటివి కూడా వ్యాయామంలో భాగమే. అందుకే ఓ పావు గంట ఇలా చేయండి. తప్పనిసరిగా వ్యాయాయం చేయాలనే నియమాన్ని పెట్టుకోకుంటే.. ఏదైనా డ్యాన్స్ క్లాసులో చేరండి. ఇక కాసేపు మీకు నచ్చిన ఆటను ఆడుకోండి.