గంటల పాటు కంప్యూటర్లకు అతుక్కుపోవడం ద్వారా కంటి ఆరోగ్యం మందగిస్తుంది. తద్వారా కంటి దృష్టి లోపాలు తప్పట్లేదు. ఇలాంటి కంటి దృష్టి లోపాల నుంచి గట్టెక్కేందుకు చాలామంది కళ్లద్దాలు వాడుతున్నారు. అయితే కళ్లద్దాలు వాడటం కంటే పోషకాహారం తీసుకుంటే కంటి దృష్టి సమస్యలు తొలగిపోతాయని ఆరోగ్యనిపుణులు సూచిస్తున్నారు.
ముఖ్యంగా రోజూ ఓ కప్పు మునగాకు, ఓ కోడిగుడ్డును ఆహారంలో తీసుకోవడం ద్వారా కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే ఆకుకూరలు, కాయగూరలతో చేసే సలాడ్లలో విటమిన్ ఎతోపాటూ కెరొటినాయిడ్స్, జియాంతిన్, లెట్యూన్ వంటి పోషకాలు ప్రత్యేకంగా అందుతాయి. ఈ పోషకాలు కంటికి హానిచేసే తీవ్రమైన కాంతి నుంచి శరీరానికి రక్షణగా నిలుస్తాయి. కాయగూరలతో చేసిన సలాడ్లవల్ల చిన్నవయసులో కళ్లద్దాల అవసరం వుండదు.
అలాగే కంటి దృష్టి లోపాలను దూరం చేసుకోవాలంటే.. కంటినిండా నిద్ర తప్పనిసరి. ఇన్‌సోమ్నియా వంటి నిద్రలేమి సమస్యలున్నవారు రోజూ సలాడ్ తినడం వల్ల హాయిగా, కంటినిండా నిద్రపోవచ్చు. సలాడ్లలో ఎక్కువగా ఉపయోగించే లెట్యూస్ ఆకులో మంచి నిద్రకు అవసరం అయిన లెక్ట్యూకారియమ్ అనే రసాయనం ఉంటుంది.