వృద్ధాప్య ఛాయలను అడ్డుకునే గ్రీన్ టీ, మరిన్ని ఉపయోగాలు

సోమవారం, 20 డిశెంబరు 2021 (21:53 IST)
గ్రీన్ టీ కప్పులో 50-150 ఎంజీల యాంటీయాక్సిడెంట్లు ఉంటాయి. ఇవి బరువు నియంత్రిస్తాయి. కెఫీన్ లేని గ్రీన్ టీ తాగడం ద్వారా ఈజీగా బరువు తగ్గించుకోవచ్చు.

 
పిల్లలకు అర కప్పు నుంచి ఒక కప్పు వరకే గ్రీన్ టీ ఇవ్వాల్సి వుండగా, పెద్దలు 2 నుంచి 4 కప్పుల గ్రీన్ టీని తీసుకోవడం ద్వారా 100-750 ఎంజీల యాంటీయాక్సిడెంట్లు లభించినట్లవుతాయి. 

 
గ్రీన్ టీ యాంటీబయోటిక్‌గా పనిచేస్తుంది. తద్వారా అలెర్జీలు దూరమవుతాయి. ఇందులోని యాంటీయాక్సిడెంట్స్ కంటి దృష్టిని మెరుగుపరుస్తుంది. సూర్యకిరణాల నుంచి శరీరాన్ని పరిరక్షిస్తుంది. వృద్ధాప్య ఛాయలను నిర్మూలిస్తుంది.

 
ఓరల్ క్యాన్సర్‌ను గ్రీన్ టీ అడ్డుకుంటుంది. దంతాలను బలపరుస్తుంది. దంత సమస్యలను దూరం చేస్తుంది. కొలెస్ట్రాల్‌ను నియత్రిస్తుంది. స్నాక్స్ టైమ్‌లో ఓ కప్పు గ్రీన్ టీని తాగడం ద్వారా హై-కొలెస్ట్రాల్‌ తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు