స్త్రీలకు రుతు సమయంలో వచ్చే నొప్పుల గురించి చెప్పాలంటే.. చాలా బాధగా ఉంటుంది. ఈ సమయంలో ఏ పని చేయాలన్నా లేదా నిద్రించాలన్నా చాలా కష్టంగా ఉంటుంది. ముఖ్యంగా కడుపునొప్పి వచ్చిందంటే.. అసలు తట్టుకోలేం. మరి ఈ నొప్పి నుండి ఉపశమనం పొందాలంటే.. ఈ 3 చిట్కాలు పాటిస్తే చాలు..
1. కడుపు నొప్పితో బాధపడేవారు కప్పు టీ డికాషన్‌లో గుప్పెడు పుదీనా ఆకులు వేసి మరిగించి సేవిస్తే బాధనుండి ఉపశమనం లభిస్తుంది. నీరసంగా ఉన్నప్పుడు..అరకప్పు పుదీనా ఆకుల్లో నిమ్మరసం, 2 చెంచాల తేనె కలిపి తీసుకుంటే ఫలితం ఉంటుంది.
2. కడుపులో మంటగా ఉన్నప్పుడు రోజుకో గ్లాస్ పుదీనా రసం తీసుకుంటే తక్షణమే ఫలితం లభిస్తుంది.
3. అరికాళ్లు, చేతులు మంటగా అనిపిస్తే పుదీనా ఆకులను ముద్దగా చేసి ఆ ప్రాంతంలో రాస్తే సరిపోతుంది. ఇదే ముద్దను గాయాల తాలూకు మచ్చలకు రాస్తే... త్వరగా నయమవుతాయని వైద్యులు సూచిస్తున్నారు.