ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. శారీరక చేస్తూనే ఉండాలి. అదే ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఆరోగ్యంతో పాటు గుండెను పదిలం చేసుకోవాలంటే... బ్రేక్‌ఫాస్ట్‌గా ఓట్స్ లేదా కార్న్‌ఫ్లేక్స్ లేదా బ్రెడ్ తీసుకోవాలి. లంచ్‌కి ఒక చపాతీ, ఒక కూరగాయ, ఒక పండు లేదా సలాడ్ తీసుకోవాలి. కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు తీసుకోవాలి.
పార్టీకి వెళ్ళినా మాంసాహారం తీసుకోకపోవడం ఉత్తమం. ఫ్రైడ్ రైస్, బిర్యానీ, అన్నం, బటర్నాన్కి బదులుగా రోటీ తీసుకోవడం మంచిది. రాత్రి భోజనం పండ్లు, పెరుగు తీసుకోవాలి. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తొందరగా డిన్నర్ ముగించాలి. రాత్రి ఏడు గంటల్లోపు చపాతీ.. పండ్లు.. పెరుగు తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది.