బార్లీ లేదా రాగులు : ప్రతి రోజూ బార్లీ నీళ్లు తాగటం. రాగి సంగటిని తినటం వల్ల వేసవిలో వచ్చే అనేక ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉండొచ్చని అంటున్నారు. బార్లీ, రాగి మన కడుపులో ఏర్పడే అల్సర్లను తగ్గించటంతో పాటుగా గ్యాస్‌ను కూడా నివారిస్తాయి.
పెసర మొలకలు : ఉదయాన్నే పెసర మొలకలు తినటం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుందని పౌష్టికాహార నిపుణులు పేర్కొంటున్నారు. పెసర మొలకల్లో ఫైబర్, ఎంజైమ్స్, విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. పెసర మొలకలను తినటం వల్ల కడుపు ఉబ్బరం తగ్గుతుంది. అంతేకాకుండా దీనిలో కొవ్వు కూడా చాలా తక్కువగా ఉంటుంది.