అయితే, ఈ సహనాన్ని ఎలా పెంపొందించుకోవాలి, ఒకవేళ సహనం తక్కువగా ఉంటే ఏ విధంగా అలవర్చుకోవాలన్న దానికి కొన్ని సాధారణ నియమాలను పాటిస్తే సరిపోతుంది. ముఖ్యంగా, మహిళలు ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటే మరీ మంచిది.
ముఖ్యంగా కీలక సమయాల్లో మన మాటకు ఎవరన్నా తగిన ప్రాధాన్యత ఇవ్వలేదనే విషయం అర్థమైనప్పటికీ దాన్ని పెద్దగా తీసుకోకుండా ఉండటం ఎంతో మంచిది. తామరాకు మీద నీటిబొట్టులాగ భావోద్వేగాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. సహనం హద్దులు దాటుతున్నట్టు లేదా నోరు అదుపు జారుతుందని అనిపించినా వెంటనే పది నుంచి ఒకటి వరకు అంకెలు లెక్కిస్తే ఖచ్చితంగా ఫలితం కనిపిస్తుంది.