పైనాపిల్ తింటే బీపీ తగ్గిపోతుందట.. దంతాలకు ఎంతో మేలు చేస్తుందట..

సోమవారం, 17 అక్టోబరు 2016 (11:11 IST)
కూరగాయలు, పండ్లు తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పండ్లు, కూరగాయలను ఎక్కువగా తీసుకోవడం ద్వారా ఒబిసిటీని దూరం చేసుకోవచ్చు. . ఇందులోని పీచు మధుమేహానికి మందులా పనిచేస్తుంది. జీర్ణక్రియనూ పెంపొందిస్తుంది. ఇందులో సమృద్ధిగా దొరికే యాంటీఆక్సిడెంట్లు సంతాన సాఫల్యానికీ తోడ్పడతాయంటున్నారు నిపుణులు.
 
అలాగే పైనాపిల్ తీసుకోవడం ద్వారా బీపీని నియంత్రించుకోవచ్చు. ఇందులోని పొటాషియం బీపీని తగ్గిస్తుంది. అలాగే పైనాపిల్‌లోని విటమిన్ సి.. అద్భుతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తూ క్యాన్సర్‌ను నిరోధిస్తుంది. క్యాన్సర్‌ రోగుల్లో రేడియేషన్‌ కారణంగా తలెత్తే దుష్ఫలితాలను ఇందులోని బ్రొమిలైన్‌ అనే ఎంజైమ్‌ సమర్థంగా నివారించగలదు. 
 
అలాగే పైనాపిల్‌లోని బీటా-కెరోటిన్‌ ప్రొస్టేట్‌ క్యాన్సర్‌నుంచి రక్షిస్తుందని ఇటీవల నిర్వహించిన పరిశోధనల్లో తేలింది. పైనాపిల్ తీసుకోవడం ద్వారా ఆస్తమాను కూడా దూరం చేసుకోవచ్చు. కంటికి పైనాపిల్ ఎంతో మేలు చేస్తుంది.కంటి కండరాల క్షీణతనీ తగ్గిస్తుందని తేలింది. ఇది కీళ్లనొప్పుల్నీ తగ్గిస్తుంది. దంతాలూ చిగుళ్లూ వంటివి బలంగా ఉండేందుకూ ఇది దోహదపడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు

వెబ్దునియా పై చదవండి