మాంసాహారులు ఇష్టపడే వాటిలో చేపలు ప్రధానమైనవని చెప్పవచ్చు. నదులు, సరస్సులు, సముద్రాల నుండి చేపలను పట్టుకుంటారు. ఈ చేపలు నివసించే ప్రాంతాన్ని బట్టి వాటి పోషకాలలో మార్పులు ఉంటాయి. నది, సముద్రంలో నివసించే చేపలలో ఏది పోషకమైనదో తెలుసుకుందాము. చాలామంది చేపలను ఇష్టపడతారు, ఎందుకంటే ఇది మాంసం వంటలలో కొవ్వు రహిత ఆహారం. చేపలలో ప్రోటీన్ పుష్కలంగా ఉండటం ఆరోగ్యానికి అవసరం.
సముద్రం, నది, సరస్సులలో పెరిగే చేపలలో ప్రోటీన్- పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. సముద్రంలో పెరిగిన చేపలు సముద్రపు పాచిని తింటాయి, వీటిలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. సార్డినెస్ వంటి చిన్న చేపలలో ఒమేగా 3 పుష్కలంగా ఉంటుంది. నదులు, సరస్సులలో పురుగులు-కీటకాలను తినే చేపలలో ఒమేగా -3 యాసిడ్ కనిపించదు.