వేసవి కాలంలో అధిక సమయం వ్యాయామం చేస్తే...

మంగళవారం, 10 మే 2016 (08:39 IST)
వేసవి ఎండలు మండిపోతున్నాయి. ఎండలకు తాళలేక, వేడికి తట్టుకోలేక ఆరోగ్యం దెబ్బతినిపోతోంది. వడదెబ్బకు అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి వేసవి కాలంలో వ్యాయామం ఎక్కువ సమయం చేయొచ్చా.. అలాగే, ఎలాంటి ఆహారం తీసుకోకూడదో ఓ సారి పరిశీలిద్ధాం. 
 
ఎండలు విపరీతంగా ఉండే వేసవిలో ఉప్పు, కారం, పులుపు ఎక్కువగా తీసుకోకూడదు. గ్రీష్మరుతువులో అతిగా, అధికంగా వ్యాయామం చెయ్యకూడదు. ఎందుకంటే 'శరీరం ఆయాసజనం' వ్యాయామం అంటారు. మన శరీరానికి శ్రమనిచ్చే వ్యాయామంతో చెమట ఎక్కువగా పడుతుంది. చెమట రూపంలో నీరు మరీ ఎక్కువగా బయటకు పోయినప్పుడు.. శుష్కత్వం, నీరసం వస్తాయి. అందువల్ల అతిగా వ్యాయామం చెయ్యకూడదు.
 
మద్యం వల్ల శరీంలో అంగ శైధిల్యం వచ్చి.. పటుత్వం తగ్గుతుంది. ఒళ్లంతా మంట వస్తుంది. ముఖ్యంగా మోహం, అంటే కళ్లు చీకట్లు కమ్ముతాయి. గ్రీష్మరుతువులో మద్యం ఎక్కువగా తీసుకుంటే ఇన్ని సమస్యలు. కాబట్టి మద్యానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. 
 
వేసవిలో కొన్నికొన్ని పానీయాలు, సేవనాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. మజ్జిగ, పాలు, నెయ్యి, కొబ్బరినీళ్లు, చెరుకురసం, పెరుగు వంటి అధికంగా తీసుకోవడం శరీరానికి ఎంతో మంచిది. 

వెబ్దునియా పై చదవండి