కొంతమంది వక్కపొడిని అదేపనిగా నములుతుంటారు. నిజానికి ఈ వక్కపొడితో పలు చెడు ఫలితాలు కూడా వున్నాయి. వక్కలు, వక్కపొడిని గర్భిణిలు, బాలింతలు తీసుకోకూడదు. బిడ్డకు, తల్లికి దుష్పరిణామాలు కలిగే ప్రమాదము ఉంది.
వక్కలలో ఆల్కలాయిడ్స్, టానిన్లు శాతము ఎక్కువగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి హానికరం. అంతేకాకుండా తరచుగా వక్కలు, ఆకులు కలిపి తీసుకుంటూ ఉంటే ఆరోగ్యానికి హానికరమని, కేన్సర్లు రావడానికి కారణం అవుతాయని నిపుణులు అంటారు.