వేసవిలో కోడిమాంసం వద్దే వద్దంటున్నారు. కోడి మాంసంలో యాంటిబయోటిక్స్ అధికంగా వాడుతున్నారని.. ఇవి మానవ శరీరానికి అంత మంచిదికాదని ఇటీవలే ఓ అధ్యయనం కూడా తేల్చింది. అదీ వేసవిలో కోడిమాంసం అధికంగా తీసుకోవడం అంత మంచిది కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చికెన్‌లోని అత్యధిక ప్రోటీన్లు, కోడిగుడ్డులోని పోషకాలు వేసవిలో అజీర్తికి కారణమవుతాయి.
అందుచేత మసాలాలు అధికంగా చేర్చిన మాంసాహారాన్ని తీసుకోకపోవడం ఉత్తమం. సీ ఫుడ్స్ వేసవిలో ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వీటిలో కూడా అధిక కారం, ఉప్పు చేర్చుకోకూడదు. మితంగా తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది.
వారానికి ఆరు కోడిగుడ్లను మాత్రమే వేసవిలో తీసుకోవాలని.. అంతకుమించితే జీర్ణక్రియకు దెబ్బేనని, శరీర ఉష్ణోగ్రతను చికెన్, కోడిగుడ్లు పెంచేస్తాయని.. తద్వారా డయేరియా వంటి సమస్యలు తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.