బరువును తగ్గించే ఖర్జూరం పండ్లు

గురువారం, 27 ఏప్రియల్ 2023 (19:16 IST)
అనేక మంది అధిక బరువు, ఊబకాయంతో బాధపడుతుంటారు. ఇలాంటి వారు బరువు తగ్గేందుకు చేయని ప్రయత్నమంటూ ఉండదు. అయితే, బరువు తగ్గాలని భావించేవారికి ఖర్జూరం పండ్లు ఎంతో మేలు చేస్తాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. 
 
బరువు తగ్గాలనుకునేవారు ఎండు ఖర్జూరాలు రోజూ తినటం మంచిదని, రోజూ కనీసం ఏడు ఖర్జూరాలు తింటే ఇందులో 40 శాతం ఫైబర్ ఉంటుందని, అందుకే జీర్ణవ్యవస్థ సాఫీగా ఉండటంతో పాటు శక్తి కూడా వస్తుంది. తక్షణ శక్తిని ఇవ్వటంలో వీటికివే సాటి. సులువుగా బరువు తగ్గుతారని వారు అంటున్నారు. 
 
అలాగే, ఖర్జూరాలను 'ది కింగ్ ఆఫ్ ఫ్రూట్స్' అని పిలుస్తారు. చెడు కొలెస్ట్రాలు తగ్గిపోవటమే కాదు రక్తపోటును కూడా తగ్గిస్తుంది. నాడీవ్యవస్థ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. దీంతో పాటు మెదడు ఆరోగ్యానికి మంచిది. ఆందోళన, ఒత్తిడిని తగ్గిస్తుంది. మెదడులోని మృతకణాలను తగ్గిస్తాయి. వీటిని తింటే అల్జీమర్స్ లక్షణాలు రావు. వీటిల్లో విటమిన్ బి, విటమిన్ కె లతో పాటు ఐరన్, కాల్షియం, మాంగనీసు ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉండటం వల్ల గుండె సమస్యలతో పాటు ప్రొస్టేట్ క్యాన్సర్ లాంటివి దరిచేరవు.
 
15 గ్రాముల ఖర్జూరాల్లో 45 కేలరీలుంటాయి. 10 గ్రాములు కార్బొహైడ్రేట్స్ ఉంటాయి. అందుకే వీటిని ఎవరైనా తినొచ్చు. వీటిలో పాస్ఫరస్, కాల్షియం, మాంగనీస్ ఉండటం వల్ల ఎముకల్లో దృఢత్వం కలుగుతుంది. కంటి ఆరోగ్యానికి మంచిది. చూపు తగ్గిపోకుండా ఉంటుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు