జుట్టు మృదువుగా మారుతుంది. దద్దుర్లూ, చర్మ సంబంధిత సమస్యలు ఇబ్బంది పెడుతుంటే కొద్దిగా ఆలివ్ ఆయిల్‌లో దీన్ని కలిపి రాసుకుంటే, సమస్యలు తగ్గుముఖం పడతాయి. సైనస్‌తో బాధపడే వారు ముక్కు, కణతుల దగ్గర కొద్దిగా యూకలిప్టస్ నూనె రాసుకుంటే ఫలితం ఉంటుంది.
లావెండర్ ఆయిల్‌ను రాత్రిపూట రాసుకుంటే.?
లావెండర్ ఆయిల్‌ను రాత్రిపూట రాసుకుంటే చర్మం మృదువుగా కోమలంగా తయారవుతుంది. పొడి చర్మం ఉన్నవారు రాత్రిపూట శరీరానికి మర్దన చేసుకుంటే చర్మం మృదువుగా మారుతుంది. లావెండర్‌లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. చిన్న చిన్న పార్టీలున్నప్పుడు గిన్నెలో నీళ్లు పోసి నాలుగు చుక్కల లావెంటర్ నూనె వేసి మరిగిస్తే, ఇల్లంతా పరిమళ భరితంగా అవుతుంది.