కాకరకాయ చెట్టు వేళ్లను పేస్టులా చేసి అక్కడ రాసుకుంటే...

శుక్రవారం, 21 జూన్ 2019 (21:18 IST)
కాకర కాయలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. రోజూ కాకరకాయ రసాన్ని కొద్దిగా తీసుకుంటే డయాబెటిస్‌ దరిచేరకుండా ఉంటుంది. లివర్‌ శుభ్రపడుతుంది. అంతేకాకుండా రక్తంను శుభ్రపరచడంలో కాకరకాయ చాలా తోడ్పడుతుంది. రక్తంలోని మలినాల వల్ల కలిగే దుష్ప్రభావాలను ఇది నివారిస్తుంది. కాకరకాయ జ్యూస్‌లో కొంచెం నిమ్మరసం కలుపుకుని ప్రతిరోజు ఉదయం పరగడుపున తాగితే అనారోగ్యం దరిచేరదు. 
 
కాకరకాయ ఆకుల నుంచి తీసిన మూడు టీ స్పూన్‌ల రసాన్ని, ఒక గ్లాసు బట్టర్‌మిల్క్‌తో కలిపి ప్రతి రోజు ఉదయం పరగడపున ఒక నెల రోజుల పాటు తీసుకుంటే పైల్స్‌ సమస్య చాలా వరకు తగ్గిపోతుంది. కాకరకాయ చెట్టు వేళ్లను పేస్టులా చేసి పైల్స్‌ ఉన్న చోట రాసుకుంటే ఉపశమనం లభిస్తుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంలో కాకరకాయ జ్యూస్‌ బాగా ఉపకరిస్తుంది. ఇన్‌ఫెక్షన్లను ఎదుర్కోవడంలోనూ, రక్తంలోని మలినాలను తొలగించడంలోనూ తోడ్పడుతుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు