రక్తపోటుతో బాధపడుతున్నారా? ఒత్తిడితో సతమతమవుతున్నారా? అయితే చెర్రీ జ్యూస్ తాగండి అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. బీపీ, హైపర్టెన్షన్ను నియంత్రించడంలో చెర్రీ జ్యూస్ దివ్యౌషధంగా పనిచేస్తుందని తాజా పరిశోధనలో తేలింది. ఉదయం నుంచి రాత్రి వరకు ఎడతెగని పనులతో ఒత్తిడికి గురువుతున్న చాలామంది.. బీపీ, హైపర్ టెన్షన్ బారినపడుతున్నారు.