ప్రకృతిలో ప్రతి ఆకు ఒక మూలిక. సృష్టిలోని ప్రతి మొక్క ఎంతోకొంత ఔషధ గుణం కలిగి ఉంటుంది. కాకపోతే మన శాస్త్రజ్ఞులు ఇప్పటికి కొన్ని గుణాలను మాత్రమే తెలుసుకోగలిగారు. గోంగూర అంటే ఇష్టపడనివారుండరు. దీనికి ఆంధ్రామాత అని పేరు కూడా ఉంది. గోగుపూలు అందంగా ఉంటాయి. అస్తమించే సూర్యుడు గోగుపూల ఛాయలో ఉంటాడని కవులు వర్ణించారు కూడా.
గోంగూరకు ఔషధ గుణాలున్నా యని పరిశోధకులు ఎప్పుడో తెలుసుకున్నారు. వ్రణాలు, గడ్డలపైన గోంగూర ఆకును ఆముదంలో ముంచి, వెచ్చచేసి వేస్తే అవి త్వరగా తగ్గిపోతాయి. అంతేకాకుండా వ్రణాలు, గడ్డల వల్ల కలిగే తీపు తగ్గి, అవి తొందరగా పగులుతాయి. స్వస్థత చిక్కుతుంది. దీనివలన కలిగే ఆరోగ్యప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
1. రేచీకటికి రాత్రిపూట సరిగా చూపు కనపడక పోవటం అనే నేత్ర రోగం లేదా దృష్టిదోషంతో బాధపడేవారు భోజనంలో ఆకుకూరగానో, పచ్చడిగానో, ఊరగాయగానో గోంగూర వాడితే కొంతమేరకు మంచి ఫలితం ఉంటుంది. గోంగూర పూలను దంచి, అరకప్పు రసం చేసి, దాన్ని వడకట్టి, దానిలో ఒక అరకప్పు పాలు కలిపి ఉదయం, సాయంత్రం రెండు పూటలా సేవించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
6. శరీరంలో నీరు చేరినప్పుడు ఈ ఆకు కూర పథ్యం చాల మంచిది. అంతేకాకుండా గోంగూర - మలబద్ధకాన్ని, రేచీకటిని తొలగిస్తుంది. ఉష్ణతత్వ శరీరులకు, నిక్కాకతో బాధపడేవారికి గోంగూర పడదు. వారు ఏ రూపాన కూడా గోంగూర తినరాదు.