పచ్చడి తీసుకుంటే.. కలిగే ప్రయోజనాలు..?

బుధవారం, 12 డిశెంబరు 2018 (14:00 IST)
పచ్చడి అంటే నచ్చని వారంటూ ఉండరు. పచ్చళ్లను.. కూరగాయలు, పండ్లతో చేస్తుంటారు. సాధారణంగా ఇంట్లో ఎప్పుడైనా కూరలు లేకపోతే పచ్చడే ఉపయోగిస్తారు. ఎప్పుడూ ఇంట్లో పచ్చడిని నిల్వచేసుకుంటారు. దీని రుచి చాలా బాగుంటుంది. నోటికి గాటుగా, పుల్లగా ఎంతో రుచిగా ఉంటుంది. పచ్చడి తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తుంది. ఇంకా చెప్పాలంటే.. శరీరానికి కావలసిన ఎనర్జీని అందిస్తుంది. మరికొన్ని ప్రయోజనాలు చూద్దాం..
 
1. కీరదోస పచ్చడి తీసుకుంటే శరీరానికి అవసరమైయ్యే పోషకవిలువలు అందుతాయి. దీంతో పాటు ప్రోటీన్స్, ఫ్యాటీ యాసిడ్స్, కార్బోహైడ్రేట్స్, ఫైబర్ ఎక్కువగా ఉన్నాయి. ఇవి కడుపునొప్పిని తగ్గిస్తాయి.
 
2. గర్భిణులు వాంతులతో బాధపడుతుంటారు. తిన్న ఆహారాన్ని కూడా కక్కేస్తుంటారు. ఈ సమస్య నుండి ఉపశమనం లభించాలంటే.. కీరదోసతో తయారుచేసిన పచ్చడిని తీసుకోండి.. వాంతి నుండి విముక్తి లభిస్తుంది. 
 
3. లివర్‌ ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. పచ్చడి తింటే.. నిద్రలేమి సమస్యపోతుంది. అందుకని ఎక్కువగా పచ్చడి తీసుకోరాదు.. వారంలో రెండుసార్లు ఉపయోగిస్తే చాలు.. ఒకవేళ పచ్చడి ఎక్కువగా తీసుకుంటే.. కడుపులో మంట ఏర్పడే అల్సర్ వ్యాధికి దారితీస్తుంది.
 
4. 5 ఎండుమిర్చి, 3 టమోటాలు, 1 ఉల్లిపాయను నూనెలో వేయించుకోవాలి. వీటిని పచ్చడిలా కచ్చాపచ్చాగా నూరుకోవాలి. ఆ తరువాత అందులో కొద్దిగా ఉప్పు, చింతపండు గుజ్జు కలిపి మరిసేపు నూరాలి. ఈ పచ్చడిలో నెయ్యి వేసి అన్నంలో కలిపి తీసుకుంటే ఆ రుచేవేరు. ఈ మిశ్రమం అనారోగ్య సమస్యల నుండి కాపాడుతుంది. 
 
5. పచ్చడి ఇన్‌ఫమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి శరీర ఇన్‌ఫెక్షన్స్‌ను తొలగిస్తాయి. శరీరంలోని చెడు వ్యర్థాలను తొలగిస్తుంది. మంచి బ్యాక్టీరియాలను ఉత్పత్తి చేస్తుంది. కీళ్లనొప్పులు రావు. ఇమ్యూనిటీ పవర్‌ను పెంచుతుంది.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు